పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు

Published: Monday March 28, 2022
సినీ గేయ రచయిత తైదల బాపు
మంచిర్యాల బ్యూరో, మార్చి 27, ప్రజాపాలన: పల్లెలే దేశానికి పట్టు కొమ్మలని, పల్లెలు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని సినీ గేయ రచయిత తైదల బాపు అన్నారు. మాదారం టౌన్ షిప్ కి చెందిన సినీ గేయ రచయిత తైదల బాపు ఆదివారం తాండూర్ మండలంలోని నీలాయ పల్లి ని సందర్శించడం జరిగింది. ఆ గ్రామంలోని పల్లె పకృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ని వాతావరణం మరెక్కడా కనిపించదని అన్నారు. ప్రకృతి వనాన్ని ఎంతో అందంగా తీర్చి దిద్దారని ఇ గ్రామ సర్పంచ్  సునీత రమేష్ ను అభినందించారు. హైదరాబాద్ లో స్థిరపడ్డా ఎప్పుడు తను పుట్టిపెరిగిన ఊరన్న ఊరు వాతావరణం అన్న తనకు  చాల ఇష్టమని అన్నారు. అందుకే సమయం దొరికినప్పుడల్లా సొంత ఊరికి వచ్చి వెళుతుంటానని పేర్కొన్నారు. పల్లెలు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, అందంగా తీర్చి దిద్దాబడాలని  ప్రభుత్వాలకు విజ్ఞప్తిచేశారు. ఈ పల్లె ప్రకృతి వనానికి, ఆటో స్టాండ్ దగ్గర కూర్చునే బెంచీలు వేయించినట్లు తెలిపిన ఆరన ఊరు అభివృద్ధికి తనను ఎప్పుడు ఏ సహాయం అడిగిన ముందుంటానని అన్నారు.