తెలంగాణ పార్టీ అభ్యర్ధి గెలుపుకు కోరుతూ ప్రచారం

Published: Friday March 05, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి: ప్రస్తుతం జరుగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు నానచెర్ల రమేష్ అన్నారు.గురువారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ మారమ్మవాడ, ఖిలానగర్ లలో పట్టభద్రులను కలిసి రుద్రమరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లగ్గోని వెంకటేశం మండల నాయకులు కొండూరు సత్తయ్య, కృష్ణ, లింగస్వామి, లవకుమార్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.