జిల్లా రజక సంఘం అధ్యక్షునిగా పెద్దలాల్ రాములు రెండవ సారి ఎంపిక

Published: Tuesday March 02, 2021

వికారాబాద్ జిల్లా మార్చ్ 01 ( ప్రజాపాలన ప్రతినిధి ) : జిల్లా రజక సంఘం అధ్యక్షునిగా పెద్దలాల్ రాములు రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల జేఏసీ చైర్మన్ పంజగారి ఆంజనేయులు, కో కన్వీనర్ గా మానస గణేష్, చిన్న మల్లికార్జున్, సిహెచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా సీత గారి లక్ష్మయ్య, అనంతయ్య, ఎల్లప్ప, లాలయ్య, బలరాంలను నియమించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ లుగా ఆనందం, నర్సింలు,  గోటిక అనంతయ్య, కొండయ్య, మల్లయ్య, గోవర్ధన్, బుచ్చయ్య, శ్రీనివాస్, బాల కృష్ణ, నరేష్, వెంకటయ్య, మల్లేష్ లను నియమించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షునిగా, తనను మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకుంన్నందుకు రజక సంఘం నాయకులకు, కార్యకర్తలకు శుభాభినందనలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, రజకుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రజక సామాజిక వర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాను అన్నారు. రజకులలో ఏ సమస్యలు ఉన్నా వెంటనే నా దృష్టికి తీసుకొని రావాలని సూచించారు.