కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు రెండు లక్షల బీమా

Published: Friday January 14, 2022
ధరూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్ల రఘువీరా రెడ్డి
వికారాబాద్ బ్యూరో 13 జనవరి ప్రజాపాలన : కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల బీమా వర్తించుటకు వయసు పరిమితి లేదని ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరా రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి నాగసముందర్ గ్రామంలో బూత్ నెంబర్-194లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రజలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమం అని ఏదైనా ప్రమాదం జరిగితే  వారికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని అన్నారు.కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది ప్రజలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న కార్యక్రమమని దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోనే ధారూర్ మండలాన్ని సభ్యత్వ నమోదు ప్రక్రియలో అగ్రగామిగా ఉంచడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ధారూర్ మండలంలో బలంగా ఉందని ఇక్కడ 10 వేలకుపైగా సభ్యత్వాలు చేసి మీ సత్తా చాటాలని ఆయన అన్నారు. 10 వేలకుపైగా సభ్యత్వాలు నమోదు చేస్తే రాహుల్ గాంధీని కలిసే అవకాశాన్ని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మండల బాధ్యులను కలిసే అవకాశాన్ని కల్పిస్తారని ఆయన తెలిపారు. జనవరి 26తో గడువు ముగియనుంది కావున మరింత వేగం పెంచాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.