మా పొట్ట కొట్టొద్దు..మా బ్రతుకు మమ్మల్ని బతకనివ్వండి

Published: Tuesday February 16, 2021
మధిర, ఫిబ్రవరి 15, ప్రజాపాలన: మున్సిపాలిటీ పరిధిలోని సిపిఎస్ స్కూల్ ముందు చిరు వ్యాపారం చేసుకుని బ్రతికే మాపై అక్కసు ఎందుకు అని చిరువ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. 15 వార్డులో సిపిఎస్ స్కూల్ ముందు సిసి డ్రైనేజ్ నిర్మాణం సమయంలో ఆ స్కూల్ ముందు ఉన్న దుకాణాలను ఆ సమయంలో తీయించారు. ఈ సైడ్ డ్రైనేజ్ పూర్తయిన తర్వాత మరల మీరే వ్యాపారం చేసుకోండి అని మున్సిపాలిటీ అధికారులు చెప్పారు కానీ ఇప్పుడు స్కూల్ హెచ్ఎం మా పాఠశాల మందు దుకాణాలు ఏర్పాటు చేయవద్దని అడ్డు చెప్పడంతో చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు గత 30 సంవత్సరాల నుండి రోడ్డు పక్కన చిన్న చిన్న కోట్లు ఏర్పాటు చేసుకొని ఇస్త్రీ పెట్టె గాలిపటాల అమ్ముకోవటం, మిషన్ కుట్టు పోవటం లాంటి వాటితో జీవనోపాధి పొందుతున్న మాలాంటి పేద వారిపై ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి మా పొట్ట మీద కొట్టొద్దు అంటూ.. సిపిఎస్ స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకు మొరపెట్టుకున్నారు. మా షాపు మేము ఏర్పాటు చేసుకుంటాం దయచేసి అధికారులు సహకరించాలని మందు డబ్బాలతో సి పి ఎస్ స్కూల్ ముందు చిరువ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న 15వ వార్డ్ కౌన్సిలర్ కోన దని కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని చిరు వ్యాపారులకు అండగా నిలిచారు.