గొర్రెలు, మేకలకు ఉచిత పి.పి.ఆర్ టీకాలు

Published: Friday February 12, 2021
వెల్గటూర్, మార్చి 11 (ప్రజాపాలన): వెల్గటూర్ మండలం ముక్కట్ పేట్, చర్లపల్లి గ్రామాలలో గొర్రెలకు మరియు మేకలకు ఉచిత పి.పి.అర్. టీకాలను గురువారం రోజు వెల్గటూర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఆధ్వర్యంలోవేసినారు. ముక్కట్రావ్ పెట్  1100 గొర్రెలకు, 280 మేకలకు అదేవిధంగా చర్లపల్లి 880 గొర్రెలకు,110 మేకలకు సర్పంచ్ ఆధ్వర్యంలో పశు వైద్య సిబ్బంది టీకాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లో ముక్కట్ రావ్ పెట్ సర్పంచ్ యాగండ్ల తిరుపతి, మండల పశు వైద్య సిబ్బంది వి.పోచయ్య, ఎల్.ఎస్.ఎ బి. మాధవి, ఎ.నాగరాజు, వీ.ఎకే. కుమార్, ఎం.పోచమల్లు పాల్గొన్నారు.