మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Published: Saturday April 15, 2023
ఎర్రుపాలెం ఏప్రిల్ 14 శుక్రవారం (ప్రజా పాలన ప్రతినిధి ) మండలంలో శుక్రవారం ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ముందుగా స్థానిక మండల కేంద్రమైన బీర్ ఎస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షులు పంబి. సాంబశివ అధ్యక్షతన అంబేద్కర్ 132వ జయంతోత్సవం అత్యంత ఘనంగా జరిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి అంబరాన్నంటే సంబరాలు చేశారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులు హైదరాబాదులోని అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మండల నాయకులు అందరూ తరలి వెళ్లారు. అదేవిధంగా పొంగిలేటి క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. బిజెపి ఆధ్వర్యంలో దేవరకొండ కోటేశ్వరావు అధ్యక్షతన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. వెంకటాపురం రైతు వేదికలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలు జరిపారు.మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి , కార్యనిర్ణ కార్యదర్శి యాకోబు,ఎంపిటిసి సగ్గుర్తి.కిషోర్ బాబు, మండల కమిటీ సభ్యులు దేవరకొండ రవి ,మహిళా మండలి అధ్యక్షులు పులి శిరీష ,తమ్ముడు సరోజిని.డిసిసిబి డైరెక్టర్ ఐలూరు వెంకటేశ్వర రెడ్డి,డాక్టర్ కోటా రాంబాబు , ఎర్రుపాలెం జడ్పిటిసి శీలం.కవిత ,గూడూర్ రమణారెడ్డి,వెంకట్రామిరెడ్డి ,బుచ్చిరెడ్డిపాలెం ఉపసర్పంచ్ నాగేశ్వరావు ,కోరపాటి కోటేశ్వరావు, వెంకటనారాయణ, తక్కలపాటి వెంకటేశ్వర్లు ,రామకృష్ణారెడ్డి , కదేవరకొండ కోటేశ్వరావు ,మొక్కపాటి శ్రీనివాసరావు ,మండల కమిటీ నాయకులు మల్లేపల్లి రామకృష్ణ ,మిర్యాల వెంకటేశ్వరావు, నరసింహారావు , దేవరకొండఏడుకొండలు, ఉప సర్పంచ్ దేవరకొండ అనిల్ కుమార్ ,లింగాల నాగేశ్వరరావు ,వెంకట నరసింహం ,సర్పంచులు మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.