బిజెపి జిల్లా అధ్యక్షుని పై జరిగిన దాడినీ ఖండించిన బిజెపి నాయకులు

Published: Thursday March 30, 2023
మధిర, మార్చి 29 ప్రజా పాలన ప్రతినిధి:నిన్న రాత్రి బోనకల్ పర్యటన సందర్భంగా వెళ్లినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పై నయీమ్ గ్యాంగ్ పేరుతో దాడికి పాల్పడిన ఘటన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.సోషల్ మీడియా లలో మహిళలపై అసభ్యకరమైన పోస్టు లు పెడుతు అవమానిస్తూ,కించపర్చే విధంగా చర్యలకు పాటుపడుతున్న గ్యాంగ్ లపై పోలీస్ వారు చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.
బిజెపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పైన దాడి కి యత్నించిన నయీమ్ గ్యాంగ్ దృచ్చెర్యలను ఖండిస్తున్నాము.గత కొంత కాలంగా బోనకల్ మండల కేంద్రంలో నయీమ్ గ్యాంగ్ పేరుతొ అనేక అక్రమాలు కు పాల్పడిన సంఘటనలు ప్రజలకు తెలిసినదే. ఇటువంటి గ్యాంగ్ లను పోలీస్ శాఖ తగు చెర్యలు చేపట్టి అణిచివేయ్యాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కు పోలీస్ సెక్ర్యూటీ కల్పించాలని కోరుతున్నాము. మత విద్వేషాలు రెచ్చకోట్టే గ్యాంగ్ ల పై వెంటనే పోలీస్ వారు కఠినమైన చెర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది. ఈ సమావేశంలో బిజెపి జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు, జిల్లా అధికార ప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లా సీనియర్ నాయకులు డివిఎన్ సోమేశ్వరావు, జిల్లా నాయకులు మర్సకట్ల స్వర్ణకర్, జిల్లా బీజేవైఎం కార్యదర్శి కాసిన నాగభూషణం, మైనారిటీ మోర్చా నాయకులు ఎస్.కె జానీ,పట్టణ ప్రధాన కార్యదర్శి బియ్యవరపు రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.