ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు. మధిర రూరల్ మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మున

Published: Tuesday March 14, 2023

భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను  స్థానిక సేవాసదనం నందు మానసిక వికలాంగుల సమక్షంలో జాగృతి మధిర మండల అధ్యక్షుడు పగిడిపల్లి వినోద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత జాగృతి మధిర నియోజకవర్గ ఇంచార్జ్ బోబ్బిళ్ళపాటి బాబురావు పాల్గొని  కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు దేవుడు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు అనంతరం ఆశ్రమంలోని మానసిక వికలాంగులకు స్వీట్స్, కేక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బట్టు వంశీ ,వేల్పుల అరవింద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు