అనుమతులు లేకుండా భవననిర్మాణాలుచేస్తే చర్యలు మున్సిపల్ కమిషనర్

Published: Monday January 23, 2023

రాయికల్,జనవరి 21(ప్రజాపాలనప్రతినిధి) రాయికల్ మున్సిపల్ పరిధిలోని ఇంటి నిర్మాణాలను తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సర్టిఫికేషన్ సిస్టం లో అనుమతి పొంది నిర్మాణాలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్ కుమార్ అన్నారు.కాగా టీఎస్ బి-పాస్ లో అనుమతి పొంది సెట్ బ్యాక్ లేకుండా, నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ఇండ్ల నిర్మాణ పనులను శనివారం పరిశీలించి, సెట్ బ్యాక్ లేని ఇండ్లకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్ బీ-పాస్ లో ధృవీకరణ చేసిన వారు తప్పక రోడ్ ఎఫెక్ట్, సెట్ బ్యాక్ లు పాటించాలని ఇంటి నిర్మాణ దారులను కోరారు.ఈ కార్యక్రమంలో టి.పి.వో రమ్య, జూనియర్ అసిస్టెంట్ హరీష్, వినయ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.