ఎస్.సి. నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ

Published: Wednesday January 18, 2023
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల
వికారాబాద్ బ్యూరో 17 జనవరి ప్రజాపాలన : షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖా  వికారాబాద్ జిల్లా గ్రూప్ 2 నుండి గ్రూప్ 4 ఉద్యోగాల కొరకు ఉచిత  ఫౌండేషన్ కోర్స్ అందజేయబడునని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం  త్వరలో నిర్వహించనున్న వివిధ ఉద్యోగాల  నియామక ప్రక్రియలో  భాగంగా షెడ్యూల్డ్ కులాల  అభివృద్ధి శాఖా వికారాబాద్ జిల్లా  వారి ఆధ్వర్యంలో డిగ్రీ, మరియు పిజీ విద్యార్హత గల ఎస్.సి. నిరుద్యోగ యువతీ యువకులకు  గ్రూప్ 2 నుండి గ్రూప్ 4 నియామకాల కొరకు మూడు నెలల పాటు ఉచిత  కోచింగ్  ఇవ్వనున్నట్లు  వికారాబాద్ జిల్లా కలెక్టర్ కే. నిఖిల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యొక్క కోచింగ్ స్థానిక డా.బి.ఆర్.అంబేద్కర్ భవన్ యందు నిష్ణాతులైన అధ్యాపకులచే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించబడుతుందని, కోచింగ్ సమయంలో వారికి   మధ్యహ్న భోజన సదుపాయంతో  పాటు ఉచితముగా అవసరమైన స్టడీ మెటీరియల్  అందచేయబడుతుందని తెలిపారు.  జిల్లాలోని  అర్హులైన ఎస్.సి. యువతీ యువకులు ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకొనేందుకు ఈ నెల 17 నుండి 31 వరకు  www.tsstudycircle.co.in ఆన్-లైన్ ద్వారా తమ ధరఖాస్తు   నమోదు చేసుకోగలరని తెలియజేసినారు.  ఆన్-లైన్ ద్వారా ధరఖాస్తు నమోదు చూసుకున్న  అభ్యర్థులకు మాత్రమే అర్హులని, పూర్తి వివరాలకు  9573859268 ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరని కోరారు.