పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

Published: Tuesday April 27, 2021

పరిగి, 26 ఏప్రిల్ ప్రజాపాలన ప్రతినిధి :  తన పోరాటాల ఫలితంగా వికారాబాద్ జిల్లా ను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్ లోకి మార్చే విధంగా ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి సఫలీకృతం అయినా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామములో పాలాభిషేకం చెయ్యడం జరిగింది.. ఈ సందర్బంగా  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలి. విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వము జిల్లాల ఏర్పాటులో భాగంగా వికారాబాద్ జిల్లా ను భౌగోళికంగా. ఆర్థికంగా..చాలా వెనుగబడిన మండలాలను కలుపుతూ వేర్పాటు చేసి తీవ్రమైన అన్యాయం చేశారు.. దానికి తోడుగా బొత్తిగా ఉద్యోగ అవకాశాలు లేని జోగులాంబ జోన్లో వికారాబాద్ జిల్లాను కలిపి నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారం చేసినాడు..జిల్లా కు జరిగిన అన్యాయాన్ని గ్రహించిన టీ ఆర్ ఆర్  జిల్లా వాసుల సహకారముతో ఉద్యమించి సాధించిన ఘనత గా అభివర్ణించారు.. రామ్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల పై పూర్తి అవగాహన ఉన్నది. జిల్లా సాగునీటి అవసరాల పట్ల.. ఆరోగ్య మౌలిక వసతుల పట్ల.. రీజినల్ రింగ్ రోడ్ జిల్లా గుండా వెళ్లే విధంగా... జిల్లాకు సంబంధించిన రహదారులపై ఒక స్పష్టమైన అవగాహన ప్రణాళిక వాటిని సాధించాలన్న దృఢ సంకల్పం సాధించడానికి చేయాల్సిన పోరాటాల పై ఒక స్పష్టమైన విధానం ఉన్నది. జిల్లాలో అసమర్ధ ప్రజాప్రతినిధుల వలన జిల్లా  చాలా అంశాల్లో తీవ్రమైన వివక్ష గురవుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా అభివృద్ధికి ప్రజా పోరాటాలు ఏకైక మార్గమని భావించి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్న టిఆర్ఆర్ గారికి ప్రజలందరూ తమ వంతు సహకారం అందించి జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్.. కాంగ్రెస్ నాయకులు ఆనందు, చంద్రకాంత్, రాఘవేందర్, షబ్బీర్, శ్రీనివాస్, శివాజీ, చెన్నయ్య, గోపాల్, లింగం, సర్దార్, తదితరులు పాల్గొన్నారు.. దోమమండల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మాలివిజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.