బిజెఆర్ వై సంఘం రాయదుర్గం ఆధ్వర్యంలో.. బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు

Published: Tuesday April 06, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : భారత దివంగత ఉప ప్రధాని, రక్షణ శాఖ మంత్రి, బాబు జగ్జీవన్రామ్ జయంతి ని పురస్కరించుకుని, రాయదుర్గం బి.జె.ర్.వై. సంఘము నందు జయంతి ఉత్సవాలను నిర్వహించారు. బిజెఆర్ వై సంఘము రాయదుర్గం ప్రధాన కార్యదర్శి శ్యామ్లేట్ నర్సింహ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా 105 గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి పాల్గొని బాబు జగ్గీవన్ విగ్రహానికి  పులా మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ మహనీయులు బాబు జగ్జీవన్ రామ్  స్వాతంత్ర్య సమర యోధునిగా, సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. స్వరాజ్య ఉద్యమం అనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంలో సైతం బాబు జగ్జీవన్‌రామ్‌ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల భవితకు అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌లు ఆనాడే పునాదులు వేశారన్నారు. మహోన్నత వ్యక్తి  జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలి ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.