కోరుట్ల పురపాలక సమావేశ మందిరంలో కౌన్సిల్ మీటింగ్

Published: Thursday September 29, 2022

కోరుట్ల, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పురపాలక సమావేశ మందిరంలో కౌన్సిల్ మీటింగ్ బుదవారం  రోజున జరిగింది.  కౌన్సిల్ సమావేశంలో  ఎమ్మెల్యే  విద్యా సాగర్ రావు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సమావేశంలో 24 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం  చైర్పర్సన్ అన్నం లావణ్య మాట్లాడుతూ కోరుట్ల మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో రెండు అవార్డులు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే విద్య సాగర్ రావు కి,వైస్ చైర్మన్, కమిషనర్ కి,  కౌన్సిలర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు మరియు పట్టణ ప్రజలకు ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు. వార్డ్  కౌన్సిలర్లు కూడా కోరుట్ల మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తూ ఇంకా ఎన్నో మరెన్నో అవార్డులు పొందడానికి కృషి చేయాలని కోరారు.మీటింగ్ అనంతరం పారిశుద్య కార్మికులకు పాత బకాయిలు అందించినందుకు పారిశుధ్య కార్మికులు  ఎమ్మెల్యేని,  చైర్ పర్సన్ ని గజమాలతో సన్మానం చేశారు. కోరుట్ల మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందడుగు వేయడానికి కృషి చేసిన  పరిశుద్య కార్మికులను ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు  సన్మానించి అభినందించినారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే  విద్యా సాగర్ రావు , చైర్ పర్సన్ అన్నం లావణ్య , వైస్ చైర్మన్ గద్దమిది పవన్,  మున్సిపల్ కమిషనర్  అయాజ్, డి యై.ఈఈ అభినయ్,  ఏ.సి.పి. వి.బి శ్రీనివాసరావు, ఏఈ లక్ష్మి , మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్, టిపిఏస్ రమ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ గజనంద్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జి.మహేష్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, మరియు కౌన్సిల్ సభ్యులు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.