ఆడపడుచులకు పుట్టింటి సారే బతుకమ్మ చీర

Published: Thursday September 29, 2022

 16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి

కోరుట్ల, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి ):
ఆడపడుచులకు పుట్టింటి సారే బతుకమ్మ చీర అని కోరుట్ల మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మా రాజారెడ్డి తెలిపారు .బుధవారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీర ల పంపిణీ కార్యక్రమం 16వ వార్డులో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ సూచనలతో వార్డులో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వార్డులోని ఆడపడుచులు ఈ బతుకమ్మ చీరలను తీసుకొని బతుకమ్మ ఆటపాటలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందిస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి ఒకటి రెండు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలు మర్చిపోరని తెలిపారు .ఈ కార్యక్రమంలో  ఆర్ పి పావని, మున్సిపల్ అధికారి సోహెల్, టిఆర్ఎస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిట్యాల కర్నాకర్, సామర్ల వేణుగోపాల్, టిఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షుడు బలిజ శివప్రసాద్ ,నాయకులు గంగ నరసయ్య, లింగయ్య, చిన్నయ్య, సత్తయ్య, రాజేష్, శేఖర్  భాగ్య, నర్సు, లక్ష్మి, వార్డులోని ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు.