ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు..

Published: Wednesday September 28, 2022
పాలేరు సెప్టెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
ప్రజలకు ఇచ్చిన హమీలను విస్మరించి, మరో మారు మోసం చేస్తున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం( ఏఐకేఎంఎస్) జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో పీవైఎల్, పీవోడబ్ల్యు. ఏఐకేఎంఎస్ సంయుక్త సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వటంలో,వ్యవసాయ కూలీలకు కనీసం కనీస వేతనాలు చట్టం అమలు చేయటం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు. పేదలకు భారం మోపుతున్నారని అన్నారు. మహిళల పై దాడులు. ఆత్యాచారాలు జరగకుండా నివారిస్తానని ఇచ్చిన హమీ విస్మరించినట్లు తెలిపారు. యువతను నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి I ఝూన్సీ, యువజన సంఘం జిల్లా కార్యదర్శి రాకేష్, ఏఐకేఎంఎస్ జిల్లా
కార్యక్రమంలో ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి
ఝాన్సీ, యువజన సంఘం జిల్లా కార్యదర్శి రాకేష్, ఏఐకేఎంఎస్ జిల్లా
నాయకులు శివలింగం, బందెల వెంకయ్య, పగిడికత్తుల వెంకటేశ్వర్లు.
పగిడికత్తుల నాగేశ్వరరావు, ఇష్టూ పాలేరు ఏరియా కార్యదర్శి పగిడికత్తుల
రామదాసు, వి.సతీష్, టి.మురళీ తదితరులు పాల్గొన్నారు.