జర్నలిస్టుల సమస్యల పై రాజీలేని పోరాటం చేస్తాం

Published: Monday September 26, 2022
ఆసిఫాబాద్ (వాంకిడి ) సెప్టెంబర్ 25  : జర్నలిస్టుల సమస్యల పై  రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టియుడబ్ల్యూజే -ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. ఆదివారం వాంకిడి మండల కేంద్రంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ద్వితీయ మహాసభల పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పై ఐక్యంగా ఉంటూ పోరాడాలని పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే ఐజేయఅన్నారు. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం దిశగా భవిష్యత్తు కార్యాచరణ పై మహాసభలు తోడ్పాటు అవుతాయన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన పోరాటాల పై మహాసభలో కార్యచరణ రూపొందించడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈనెల 28వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే జర్నలిస్టుల జిల్లా మహాసభల కు  జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సురేష్ చారి, విజయ్ కుమార్ పాత్రికేయులు డి సునీల్, ఏ రవీందర్ , ఆర్ రాంబాబు , కృష్ణపల్లి రాజేశ్వర్ , రాందాస్ తదితరులు పాల్గొన్నారు.