బూర్గంపాడు ముంపు ప్రాంతం గురించి కరకట్ట నిర్మాణం చేపట్టబోయే విధానం గురించి ప్రభుత్వ విప్ ర

Published: Monday September 26, 2022
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు ...ఇటీవల గోదావరి నదికి భారీ వరదల వలన ముంపునకు  గురైన ప్రాంతాల  రక్షణ కొరకు తెలంగాణ ప్రభుత్వం  నిర్మించ తలపెట్టిన కరకట్టకు సంబంధించి ఐఐటి మరియు నీటిపారుదల శాఖ నిపుణులు రూపొందించిన  కరకట్ట సంబంధించి మ్యాపును పరిశీలిస్తూ. వంద అడుగుల ఎత్తులో 120 కిలోమీటర్ల పొడవునా కరకట్ట నిర్మాణం ఉంటుందని వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మరియు బూర్గంపాడు మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, టౌన్ అధ్యక్షులు కొనకంచి శ్రీను వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ ఏసోబు, తుపాకుల రవి బాలి శ్రీహరి చల్లకోటి పూర్ణ తెలంగాణ సీనియర్ నాయకులు పోడియం నరేంద్ర మిగతా  ప్రజాప్రతినిధులు, నాయకులకు... వివరించడం జరిగింది...