మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు చరిత్ర సృష్టించే తీర్పు ఇవ్వాలి -- కోమటిరెడ్డి రాజగోపాల్ ర

Published: Monday September 26, 2022
1200 మంది బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన చేస్తున్నారు
 
చౌటుప్పల్, సెప్టెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం ను నియంతలా పాలిస్తున్న కెసిఆర్ కు మునుగోడు ఉప ఎన్నిక లో ప్రజలు బుద్ధి చెప్పాలని మునుగోడు మాజీ శాసనసభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలంలోని కైతాపురం, కొయ్యలగూడెం, మందోళ్ళ గూడెం, కుంట్ల గూడెం అంకిరెడ్డిగూడెం గ్రామాలలో వివిధ పార్టీల నుండి సుమారు 800 మంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ గ్రామాలలో బిజెపి జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీలో చేరిన వారందరినీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 1200 మంది తెలంగాణ కోసం బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ లో కెసిఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని అన్నారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే కెసిఆర్ పాలనలో కొడుకు,కూతురు అల్లుడికి పదవులు వచ్చాయన్నారు.ధనిక రాష్ట్రం గా వున్న తెలంగాణ లో అనవసర ప్రాజెక్ట్ లు నిర్మించి ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కెసిఆర్ చేసినారన్నారు.
డబుల్ బెడ్ రూంలు కేవలం సిరిసిల్ల గజ్వేలు సిద్దిపేటకు మాత్రమే ఇచ్చారని రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గాల్లో కూడా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు ఇవ్వలేదన్నారు. ఎంతోమంది చేతివృత్తులను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న వారికి టిఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. ఉప ఎన్నికలు వస్తేనే కెసిఆర్ కు ప్రజలు గుర్తొస్తారని. అనేక సంక్షేమ పథకాలు అప్పుడు గుర్తుకొస్తాయన్నారు. మునుగోడులో మంత్రులు ఎమ్మెల్యేలు తిష్ట వేసి ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్నారు. 
మునుగోడు ఉప ఎన్నికల్లో చరిత్ర సృష్టించే తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు.మోడీ, అమిత్ షా నాయకత్వం లో మునుగోడు నియోజక వర్గంలో కాషాయ జెండా ఎగరేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, మండల పార్టీ అధ్యక్షులు రెక్కల సుధాకర్ రెడ్డి, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు ఊడుగు వెంకటేశం గౌడ్, భాజపా నాయకులు రమణ గోని శంకర్, దూడల భిక్షం, గుజ్జుల సురేందర్ రెడ్డి, ఉబ్బు వెంకటయ్య, మోగుదాల రమేష్ గౌడ్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, కొయ్యడ సైదులు గౌడ్, పబ్బు రాజు గౌడ్, పెద్దీటి బుచ్చిరెడ్డి, కాయితీ రమేష్ గౌడ్, బాతరాజు సత్యం, బండమీది మల్లేశం, ఆలే నాగరాజు, పోలోజు శ్రీధర్ బాబు, బత్తుల జంగయ్య గౌడ్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, దాసోజు బిక్షమాచారి, దిండు భాస్కర్, భాజపా వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో భాజపా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.