భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా

Published: Tuesday September 20, 2022

రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం చౌరస్తాలో డెంగ్యూ జ్వరాలను నియంత్రించడంలో ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ అధికారులు విఫలమైనారని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు కల్లెడ ధర్మపురి  మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ప్రాణాలతో చేలగాటం ఆడుతుందని,ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు లేని కారణంగా పేద ప్రజలు డెంగ్యూ జ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్నారని రాయికల్ మండలంలో ఇప్పటికే డెంగ్యూ జ్వరాలతో ఎనిమిది మంది చనిపోయారని  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తే బిల్లులు తడిసి మోపిడౌతుందని,వైద్యం చేయించుకోలేని పరిస్థితులు ఉన్నాయని, పేద ప్రజలను డెంగ్యూ జ్వరాల భారీ నుండి కాపాడాలని ధర్నాలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ధర్మపురి, ధర్నావద్దకు చేరుకున్న జిల్లా ఉపవైద్యాధికారి శ్రీనివాసుకు వినతిపత్రం సమర్పిస్తూ కోరారు . ఈ ధర్నా కార్యక్రమంలో కుంబోజి రవి, సామల సతీష్, కురుమ మల్లారెడ్డి ,చిలివేరి ప్రవీణ్, కూనారపు భూమేష్ ,కొడిమ్యాల రామకృష్ణ ,శంకర్, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు