బూర్గంపాడు మండలంలో పలువురికి షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులను అందజేసిన బూర్గంపాడు జ

Published: Tuesday September 20, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు, బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత సోమవారం నాడు మండల పరిధిలోని కృష్ణ సాగర్, ముసలిమడుగు, నకిరి పేట, లక్ష్మీపురం, వేపల గడ్డ, పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,  చెక్కులను సుమారు 12 మంది లబ్ధిదారులకు 12 లక్షల విలువగల చెక్కులను వారి నివాసాలకు వెళ్లి పంపిణీ చేసిన... బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత*
ఈ సందర్భంగా బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ*
పేద కుటుంబాలలో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ గారి ధ్యేయమని అన్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రూ.100,116/ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు, సీఎం కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేనటువంటి అనేక పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని రైతుబంధు, రైతు బీమా ఇవే కాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు, పేదల కష్టాలు  దగ్గర నుండి చూసిన సీఎం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేద కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారని అన్నారు. 
ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందిన లబ్ధిదారులంతా మరింత మంది అర్హులకు పథకం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. కృషి చేయాలని తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం పేద మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల పెండ్లిలకు కొండంత అండగా నిలుస్తుందని అన్నారు, ఆడబిడ్డల పెండ్లిల్లా తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు ఈ పథకం ప్రవేశపెట్టారు అన్నారు, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రోత్స సంక్షేమ పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని వారు తెలిపారు*...ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, కృష్ణ సాగర్, ముసలిమడుగు, లక్ష్మీపురం, వేపలగడ్డ, నకిరేపేట, సర్పంచ్ లు కే. వెంకటేశ్వర్లు, కే వెంకటరమణ, ఎస్ నాగమణి, వెంకటేశ్వర్లు, చిన్నఅబ్బాయి, టిఆర్ఎస్ పార్టీ ST సెల్ మండల అధ్యక్షులు  రాఘవులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండేటి గోవర్ధన్, రమేష్, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు*...
 
 
 
Attachments area