కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచే వరకు పోరాటం ** సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ **

Published: Monday September 19, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్18 (ప్రజాపాలన, ప్రతినిధి) : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోనిసీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని వెంటనే సింగరేణి ఉన్నతాధికారులు సమస్యల పరిష్కారానికై ముందుకు రావాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. సమ్మె 10వ రోజుకు చేరుకుందని యాజమాన్యం వేతనాల పెంపు విషయంలో మొండి వైఖరి విడనాడాలని, వేలాది మంది  సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని అన్నారు. సింగరేణి కి వచ్చే లాభాలలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కీలకంగా  ఉన్నప్పుడు ఎందుకు వేతనాలు పెంచడం లేదని డిమాండ్ చేశారు. పోటీ కార్మికులను పెట్టి, షోకాజ్ నోటీసులు ఇచ్చి, బెదిరింపులకు గురి చేయడం సరైంది కాదని హెచ్చరించారు. వేతనాలు పెరిగే వరకు పోరాటం కొనసాగుతుందని, అందుకు కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధంగా ఉండాలని సిఐటియు పిలుపు నిస్తుందన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్, ఉపాధ్యక్షుడు ఆనంద్ కుమార్, రాజేందర్, ఓదెలు, పాల్గొన్నారు.
 
 
 
Attachments area