ఆసరా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంపీ. మన్నే. శ్రీనివాస్ రెడ్డి.

Published: Friday September 16, 2022

ప్రజాపాలన ప్రతినిధి. సెప్టెంబర్ 15    నవాబ్ పేట  మండలం లోని అన్ని గ్రామాల్లో అర్హులు అయిన వారందరికీ బుధవారం ఆసరా, వికలాంగుల, వృద్ధులు ఒంటరి మహిళలకు గుర్తించి పంపిణీ చేశారు.టీఆరెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని వారు అన్నారు.ఫించన్లతో పాటు పెళ్లి చేసుకున్న పేద కుటుంబాల ఆడపడుచు లకు నూట పదహారు లక్ష రూపాయలను ఇచ్చి పేదింటి మేనమామ గా ముఖ్య మంత్రి కేసీఆర్ గొప్ప పథకం ద్వారా పంపిణీ చేస్తున్నారు అని అన్నారు.రైతులకు రైతు బంధు, భీమా ఇవ్వడం దేశం లో నే నెంబర్ వన్ ముఖ్య మంత్రి గా పేరొందారు అని అన్నారు.దళిత బంధు లాంటి పథకం ఇతర రాష్ట్రాలనుండి ప్రశంసలు అందుకున్నారు అని అన్నారు.విద్య, వైద్యం సంబంధించిన అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అని అన్నారు.కాంగ్రెస్ బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.గతంలో పాలించిన ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు ఏదో చేస్తారని ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య యంపీపీ అనంతయ్య జెడ్పీటీసీ రవిందర్ రెడ్డి యంఆర్వో రాజేందర్ రెడ్డి యంపీడీఓ శ్రీలత ఎస్సై శ్రీకాంత్ పీఏసీఎస్ అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు యువత అధ్యక్షుడు మెండె శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య వైఎస్ చైర్మన్ చందర్ నాయక్ ప్రతాప్ మధుసూదన్ రెడ్డి గండు చెన్నయ్య గోపాల్ గౌడ్ ఆయా గ్రామాల యంపీటీసీలు సర్పంచ్ లు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.