ఎర్రవల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 02 మార్చి ప్రజాపాలన : ఎర్రవల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ నిఖిల పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో కెపిఎఫ్ (కృష్ణ ప్రసాద్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మల్లమ్మ హనుమంతు సమక్షంలో విశ్రాంత ఐపిఎస్ అధికారి కృష్ణప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్, నైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల విద్యాభ్యాసం అర్ధాంతరంగా ఆగిపోకుండా 36 సైకిళ్ళను పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కెపిఎఫ్ వ్యవస్థాపకుడు విశ్రాంత ఐపిఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, లైవ్లీహుడ్ ప్రధాన నాలుగు లక్ష్యాలను సాధించేందుకు కెపిఎఫ్ ను స్థాపించామని పేర్కొన్నారు. అన్ని రంగాలలో వెనుకబడిన ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నామని వివరించారు. పాఠశాల అభివృద్ధికి డ్యూయల్ బెంచీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎర్రవల్లి గ్రామానికి సమీపంలో ఉన్న చెంచుపల్లిని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. బాలబాలికలకు, యువతకు, మహిళలకు పనులలో నైపుణ్య శిక్షణను అందిస్తే స్వయం ఆర్థికాభివృద్ధి చెందుతారని ఆకాంక్షించారు. దేశంలో పూర్తిగా వెనుక బడిన 12 జిల్లాలను దత్తత తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ క్రిష్ణన్, ఎంపిడిఓ సత్తయ్య, మాజీ సర్పంచ్ సుభాన్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, రాంచందర్, రవీందర్, రామేశ్వర్, నర్సిములు, తులసీదాసు, హనుమంతు, లక్ష్మయ్య, భీమయ్య వార్డు మెంబర్లు తుల్జారాం లక్ష్మి మహిళి సంఘం అధ్యక్షురాలు, ప్రధానోపాధ్యాయులు నీల్యా గ్రామస్థులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...