కంటి చూపును ఇవ్వడం మరో జన్మను ప్రసాదించడమే,
లయన్స్ క్లబ్ జిల్లా సేవల సమన్వయకర్త సింహరాజు కోదండరాం.
వెల్గటూర్, నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : కంటిచూపును ఇవ్వడం అం మరో జన్మలో ప్రసాదించడమే, ఈ సమస్యలతో బాధపడే వారికి నేత్ర వైద్య సేవలు అందించి వారిని శాశ్వత అంధత్వం నుంచి కాపాడేందుకు లైన్స్ క్లబ్ సేవల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రధానమైనదని లయన్స్ క్లబ్ సేవల జిల్లా కోఆర్డినేటర్ సింహరాజు కోదండరాం అభిప్రాయపడ్డారు. మంగళవారం వెల్గటూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కంటి చూపు తో బాధపడేవారు చికిత్సకోసం వచ్చారు. 200 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా వీరిలో 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో 75 మందికి మోతె బిందు (కంటిలో శుక్లాలు) సమస్య ఉన్నట్టు నిర్ధారించడం జరిగింది. వీరిని రేకుర్తి కంటి ఆస్పత్రి లో శస్త్రచికిత్స చేయించడానికి గుర్తించారు. తొలివిడతగా రేకుర్తి కంటి ఆసుపత్రి ప్రత్యేక వాహనంలో 25 మందిని శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని విడతలవారీగా శస్త్ర చికిత్సలకు పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సింహ రాజు కోదండరాం మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేపడుతున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో నేత్ర వైద్య శిబిరం అత్యంత ప్రధానమైనదని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థ అయిన లయన్స్ క్లబ్ ద్వారా నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు లక్షలాది మందికి రేకుర్తి కంటి ఆసుపత్రి ద్వారా శస్త్ర చికిత్సలు చేయించి శాశ్వత అంధత్వం నుంచి విముక్తి కల్పించడం జరిగిందన్నారు. వృద్ధాప్య దశ లో కంటిచూపును ప్రసాదించడం వారికి మరో జన్మ ను అందివ్వడం లాంటిదని పేర్కొన్నారు. మారుతి మెడికల్ స్టోర్ ఆవరణలో జరిగిన ఈ శిబిరంలో వైద్య పరీక్షల కోసం వచ్చిన వారికి మెడికల్ షాప్ యజమానులు కాశ శ్రీధర్, కాశ రవి లు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ మేరుగు మురళి గౌడ్, కార్యక్రమంలో అధ్యక్షుడు మద్ది మురళీధర్, కార్యదర్శి వైద్య వెంకట్, కోశాధికారి గట్ల రాజేందర్, ఉపాధ్యక్షులు సిరిపురం తిరుపతి, నోముల వెంకట్ రెడ్డి, పి ఆర్ ఓ నక్క సురేష్, డైరెక్టర్ల బోర్డు సభ్యులు బండారి చంద్రమౌళి, తిప్పర్తి పురుషోత్తం, తిప్పర్తి భూమయ్య, సంకోజు నరేష్, గాదాసు రాజేందర్, రేకుర్తి ఆస్పత్రి వైద్య బృందం సభ్యులు ప్రభాకర్, స్వామి, ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి, కళ్యాణి.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...