అక్టోబర్ 9న దళిత బంధు కై చలో హైదరాబాద్
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను నియమించాలని, దళిత బంధు ను రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 9న కెవిపిఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద జరుగు దళితుల మహాధర్నాను జయప్రదం చేయాలని కెవిపిఎస్ కర పత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా బోడ సామేలు మాట్లాడుతూ దళితులు, గిరిజనులపై రాష్ట్రంలో అనేకచోట్ల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరని, దళితులకు అన్యాయం జరిగితే తమ గోడు చెప్పుకోవడానికి ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ లేక తలలేని మొండెం లాగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ ను నియమించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు పథకాన్ని అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణం కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సబ్సిడీలు వెంటనే విడుదల చేయాలన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎస్సి కార్పొరేషన్ రుణాలు అందించాలన్నారు. పోరాడి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తున్నారని వారు విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దళిత వాడలను అభివృద్ధి చేసేందుకు నిర్ధిష్టంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 9వ తేదీన జరుగు మహాధర్నాలో దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్ కరత్, శంకర్, రాజు, విజయ్, గిరి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...