నాయకుల పై దాడిని ఖండించిన అఖిలపక్షం.
బెల్లంపల్లి జూన్ 10 ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ స్థలంలో ని టకారియ నగర్లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లిన అఖిలపక్షం నాయకుడైన గెల్లి జయరామ్ పై దాడి చేసి తీవ్రంగా దూషించిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, జయరామ్ పై జరిగిన దాడిని బెల్లంపల్లి అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు విలేకరులతో మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ముందుగల టకారియా నగర్ లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలిసిన సమాచారం మేరకు నిజనిర్ధారణ చేయడానికి వెళ్ళిన అఖిలపక్ష నాయకులకు తెరాస భూ ఆక్రమణ దారులైన గోలి శివ, రేవెల్లి విజయ్, కౌన్సిలర్ రాములు నాయక్ మరికొంత మంది వారి అనుచరులు తప్పతాగిన మైకంలో గెల్లి జయరాం పై తీవ్ర దూషణలు చేస్తూ గుండాల్లాగా ప్రవర్తిస్తూ దాడి చేశారని వారన్నారు, టకారియా నగర్ విషయమై గతంలో లో కోర్టుకు కూడా వెళ్ళామని కోర్టు నిబంధనల మేరకు స్థానిక ఆర్డిఓ అక్రమ నిర్మాణాలను గతంలో కూల్చివేయడం కూడా జరిగిందని గుర్తుచేశారు. ఐతే తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిసిన విషయం పై నిజ నిర్ధారణకు వెళ్లగా మా పై దాడి చేశారని తెలిపారు, మేము దళితులము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు ఇక్కడి నుండి వెంటనే వెళ్లకపోతే బట్టలు చింపుకొని బ్లేడ్‌తో కోసుకొని పోలీస్ స్టేషన్ కు పోయి మేమే ఫిర్యాదు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. కోటి రూపాయల ఈ భూమి కోసం చంపడానికి అయినా చావడానికైనా సిద్ధమేనని అంటూ నాయకుల పై దాడి చేయడం జరిగిందని అన్నారు, ఈ విషయమై తిరిగి కోర్టుకు కూడా వెళ్తామని, ఇప్పటికైనా లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి స్థానిక నియోజకవర్గ స్థాయి అగ్ర నాయకుని తోడ్పాటుతో రాత్రికి రాత్రులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేసి, నిర్మించిన వాటిని కూల్చివేసి దాడి చేసిన గోలి శివ, రేవెల్లి విజయ్, రాములు నాయక్, వారి అనుచరులపై తక్షణమేచర్యలు తీసుకోవాలని లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు, గెల్లి జయరామ్ యాదవ్, బత్తుల మధు, కాశీ సతీష్, ఆడెపు మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...