ప్రత్తి పంటలో అంతర పంటగా కందిని వేసుకోవడం ఎంతో ఉపయోగం.
బెల్లంపల్లి, జూన్ 2, ప్రజాపాలన ప్రతినిధి : ప్రత్తి పంటలో అంతర సాగుగా కంది పంటను వేసుకోవడం రైతులకు ఎంతో ఉపయోగకరంగాను లాభసాటిగా ఉంటుందని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్ రైతులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడు ఆయన పత్రికలకు ప్రకటన విడుదల చేస్తూ సాధారణంగా మంచిర్యాల మరియు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రైతులు వర్షాకాలంలో అధిక విస్తీర్ణంలో ప్రత్తి పంటను సాగు చేయడం జరుగుతుందని. రైతులు సరైన అవగాహన లేనందున కేవలం పత్తి పంటనే సంవత్సరాలుగా సాగు చేయడం వల్ల నేల యొక్క పోషక విలువల స్థాయి తగ్గి పంటల దిగుబడి క్షీణించే అవకాశం ఉందని. ఇటువంటి క్రమంలో శాస్త్రవేత్తలు ప్రత్తి పంటలో కందిని ప్రతి 4 లేదా 6 లేదా 8 సాల్లకు ఒక సాలు చొప్పున కంది సాల్లు వేసుకోవాలని సూచిస్తున్నారని ఈ విధంగా కంది పంటను పత్తి పంట మధ్యలో అంతర పంటగా వేయడం వల్ల పలు లాభాలు ఉన్నాయని ఆయన సూచించారు. కంది పంటను అంతరపంటగా వేసినట్లయితే గాలిలోని నత్రజనిని స్వీకరించి నేలలోని పోషక విలువల స్థాయిని పెంచుతుందని. అంతర పంటగా కందిని వేసుకోవడం వల్ల తక్కువ ప్రదేశంలో అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని. ఈ విధంగా అంతర పంటలు సాగు చేయడం వల్ల ప్రధాన పంట అయిన పత్తి పంట లో వచ్చే చీడపీడలను అదుపుచేసే మిత్ర పురుగుల వృద్ధికి అవకాశం ఉంటుందని. కంది పంట వల్ల పత్తిలో ప్రధానంగా కనిపించే కలుపు సమస్యను కొంత మేరకు నియంత్రించవచ్చునని. అదేవిధంగా భూమిలోని కర్బన స్థాయిని పెంచి సూక్ష్మజీవుల యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుందని. సంక్లిష్ట పరిస్థితులలో అధిక వర్షాల వల్ల గాని లేదా వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ ప్రధాన పంట అయినా ప్రతి పంట నష్టపోయినట్టయితే అంతర పంట నుండి ఆలాభాలు పొందవచ్చునని ఆయన తెలిపారు. అందువల్ల మంచిర్యాల మరియు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో పత్తిని పండించే రైతులందరూ విధిగా తమ తమ పొలాల్లో పత్తి పంట మధ్యలో కంది పంటను అంతరపంటగా వేసుకొని లాభాలను పొందడంతో పాటు నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...