పట్టుదలతో చదివి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల బ
విద్యార్థులు పట్టుదలతో చదివి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రతిభా ప్రోత్సాహక పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన అభినందన, ప్రోత్సాహక కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో రాణించేలా విద్యార్థులకు సన్నద్ధం చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్ ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ, జిల్లా పరిషత్, కస్తూరిభా, ఆదర్శ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులకు ఉచిత విద్య అందిచేందుకు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ వారు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహక పురస్కారాలను అందజేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష ద్వారా అత్యుత్తమ ప్రదర్శన చూపిన 10 మంది విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహక పురస్కారములు అందజేయడం జరిగిందని, జిల్లా స్థాయిలో మొదటి 3 స్థానాలలో నిలిచిన ముగ్గురు విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యను పూర్తి ఉచితంగా చదివించడానికి అవినాష్ కాలేజెస్ ఆఫ్ కామర్స్-హైదరాబాదు వారు ముందుకు వచ్చారని, వారి సంబంధిత సంస్థలో అడ్మిషన్ పూర్తి ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు ఇదే స్ఫూర్తితో పట్టుదలతో చదివి విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు, అవినాష్ కాలేజెస్ ఆఫ్ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ హెడ్ డా. సాయికుమార్, డైరెక్టర్ సంతోష్, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి భీంరావు, సహాయ కార్యదర్శి దేవసాని కుమారస్వామి, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...