ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 21ప్రజాపాలన ప్రతినిధి *జిల్లాలలో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ
శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జనవరి 19, 20వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కంటి వెలుగు శిబిరాల వివరాలను వైద్య శాఖ అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లో 3,81,426 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 97,335 మందికి రీడింగ్ కళ్ళద్దాలు పంపిణీ చేశామని, 77,142 ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను ఆర్డర్ చేశామని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ లను, సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు. ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు క్యాంపులు జరుగుతాయని, శని ఆదివారాలు క్యాంపులు ఉండవని సీఎస్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9-15 లోపు కంటి వెలుగు క్యాంపుల సమాచారం అప్ డేట్ చేయాలని సీఎస్ సూచించారు.జిల్లాలలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా కంటి వెలుగు క్యాంపులో పర్యటించాలని, జిల్లా కలెక్టర్ లు సదరు బృందాల ఫీడ్ బ్యాక్ తీసుకుని మరింత మెరుగ్గా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో నిర్వహించిన 2 రోజులు క్యాంపులో 11 జిల్లాల పరిధిలో 53% పైగా కళ్ళద్దాల పంపిణీ/ఆర్డర్ అవసరం అయ్యాయని సీఎస్ తెలిపారు.
జిల్లాలో ఉన్న బఫర్ బృందాలను ఉపయోగిస్తూ జర్నలిస్టులకు,ఉద్యోగులకు, పోలీసులకు, కోర్టు సిబ్బంది, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కంటి వెలుగు క్యాంపులను నిర్వహించాలని అన్నారు. జిల్లాలో రాబోయే 15 రోజులలో బఫర్ బృందాల ద్వారా ప్రత్యేక వర్గాల కోసం క్యాంపులు ఏర్పాటు కావాలని, దీనికి అవసరమైన షెడ్యూల్ తయారు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో పక్కాగా ట్యాబ్ ఎంట్రీ వివరాలు నమోదు కావాలని, ప్రతి రోజూ ట్యాబ్ ఎంట్రీ పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు. జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ బృందాల ద్వారా ప్రతి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకొని చిన్న, చిన్న లోటుపాట్లను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న రీడింగ్ కళ్ళద్దాల స్టాక్ ను కలెక్టర్ లు ప్రతి రోజూ పర్యవేక్షించాలని, అవసరమైన కళ్ళద్దాల స్టాక్ వివరాలు పాయింట్ల వారిగా ముందుగా సమాచారం అందిస్తే జిల్లాలకు సకాలంలో సరఫరా చేస్తామని అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 2 రోజుల్లో 17892 మందికి జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహించి 3959 మందికి రీడింగ్ కళ్ళద్దాలు అందించామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేస్తామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వేంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ సీఈవో దిలీప్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...