శభాష్ అంటూ ప్రజలు ప్రజాప్రతినిధులు మెచ్చిన అధికారి మధిర సిఐ మురళి మధిర అక్టోబర్ 19 ప్రజా పాలన
మధిర సిఐగా వడ్డేపల్లి మురళి బాధ్యతలు స్వీకరించి బుధవారం నాటికి రెండేళ్లు పూర్తయింది. రెండేళ్లుగా సిఐగా విధులు నిర్వహించిన మురళి ఎక్కడా హడావుడి చేయలేదు హంగామా సృష్టించలేదు. తన విధులను బాధ్యతతో నిర్వహిస్తూ శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తూ మధిర ప్రజల్లో సీఐ మురళి సుస్థిరస్థానం పొందారు. మధిర సిఐ మురళి సర్కిల్ పరిధిలో క్రింది స్థాయి సిబ్బందితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతలు కాపాడటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందారు. అప్పటికే జిల్లాలో సిఐ మురళికి నిజాయితీ అధికారిగా, వివాదరహితుడిగా, శాంతిభద్రతలను కాపాడే విషయంలో సమర్ధుడైన అధికారిగా పోలీస్ శాఖలో పేరుంది. చైతన్యవంతమైన మధిర ప్రజలు మురళి పనితీరును గ్రహించి శాంతిభద్రతల విషయంలో పోలీసు శాఖ తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలిపారు. ప్రజల సహకారం, సిబ్బంది కృషితో సిఐ మురళి పర్యవేక్షణలో వినాయక చవితి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు ఎటువంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ప్రజల భాగస్వామ్యంతో మధిరలో భారీ స్థాయిలో విజయవంతం చేయటంలో మధిర సీఐ మురళి పాత్ర ఎంతో అమోఘం అని ఇతర శాఖల అధికారులు ప్రశంసించారు. అంతేకాకుండా జిల్లాలో సంచలనం సృష్టించిన రేమిడిచర్ల, మధిర మైనర్ బాలికల కిడ్నాప్ కేసును సవాల్ గా స్వీకరించి చేధించారు. మధిర ప్రాంతంలో ఐరన్ షీట్లు చోరీలకు పాల్పడి 12 పోలీస్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైన అంతర్రాష్ట్ర దొంగలను సీఐ పర్యవేక్షణలో అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు స్కూటీలు ఇస్తానని చెప్పి ప్రజల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసి పరారైన వ్యక్తిని పట్టుకొచ్చి జైల్లో పెట్టారు. సంవత్సరాల తరబడి మధిర పోలీస్ సర్కిల్ కార్యాలయంకు ప్రత్యేకంగా కార్యాలయం లేదు. సీఐగా బాధ్యతలు స్వీకరించిన మురళి అనతికాలంలోనే మధిర సర్కిల్ కార్యాలయం నిర్మాణం పూర్తిచేసి సిపి విష్ణు వారియర్ చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేశారు. యువత గంజాయి బారిన పడకుండా రాత్రివేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి గంజాయి తీసుకున్న యువతను అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. సీఐ మురళి సమర్ధుడైన అధికారి కాబట్టే ఎటువంటి వివాదాలు లేకుండా, పైరవీ కారులను, భజన పరులను దరిదాపుల్లోకి రానివ్వకుండా కట్టడి చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను అమలు చేస్తూ అన్యాయానికి గురైన వారు నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి కేసును పూర్వాపరాలు పరిశీలించి న్యాయం చేస్తూ బాధితులకు అండగా నిలిచారు. కరోనా సమయంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేసే మధిరలో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో సఫలీకృతం అయ్యారు. ప్రచారానికి దూరంగా ఉంటూ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ మధిర ప్రజల మన్ననలు పొందిన ఘనత సిఐ మురళికి దక్కిందనటంలో ఎటువంటి అతియోశక్తి లేదు. ఈ సందర్భంగా సిఐ మురళి ఆంధ్ర ప్రభతో మాట్లాడుతూ ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు వైరా ఏసీపీ రెహమాన్ పర్యవేక్షణలో మధిర సర్కిల్ పరిధిలోని సిబ్బంది సహకారంతో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మధిర సర్కిల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...