*మధిరలో పెట్రేగిపోతున్న హిజ్రాలు
మధిర సెప్టెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధిగతంలో పెద్దపెద్ద పట్టణాలకే పరిమితమైన హిజ్రాల దాడులు తాజాగా మధిర పట్టణంలో చోటు చేసుకోవటం పట్టణ ప్రజలను వ్యాపారును భయభ్రాంతులకు గురిచేసింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది హిజ్రాలు మధిరకు చేరుకొని డబ్బులు ఇవ్వని వ్యక్తులపై దాడి చేయడం దూషించడం గత కొంతకాలంగా మధిరలో తరచుగా జరుగుతోంది. హిజ్రాల వల్ల రాత్రిపూట గృహాలకు చేరే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకీ వారి ఆగడాలు పెరిగిపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా వాహనదారులను, ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మధిర రైల్వే గేటు వద్ద హిజ్రాలు కాపుగాసి ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వాహనదారులను వెంటపడి వేధించి డబ్బులు ఇచ్చే వరకు వదలడంలేదు. తాజాగా మంగళవారం రాత్రి మధిర పట్టణంలో ఇల్లెందలపాడు సమీపము నందు ఉన్న కోల్డ్ స్టోరేజీ యజమానిపై హిజ్రాలు దసరా మామూలు కోసం దాడి చేసి గాయపరిచిన సంఘటన సంచలనం సృష్టించింది. దసరా మామూళ్లు కోసం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం వద్దకు 25 మంది ఆంధ్రకు చెందిన హిజ్రాలు 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత మామూళ్లు ఇవ్వలేనని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం చెప్పడంతో విచక్షణ కోల్పోయిన 25 మంది హిజ్రాలు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంపై దాడి చేసి విచక్షణారహితంగా గాయపరిచారు.గతంలో మధిర ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగలేదు. ఇప్పటివరకు పట్టణంలో ఎక్కడైనా వివాహం జరిగిన ఓణీలు ఫంక్షన్ జరిగినా హిజ్రాలు ప్రవేశించి డబ్బులు డిమాండ్ చేయటం జరుగుతుంది. ఎవరైనా డబ్బులు లేవు అంటే అక్కడ హిజ్రాలు పెద్ద వివాదాన్ని సృష్టిస్తున్నారు. వీళ్ళతో ఎందుకులే అనుకోని శుభకార్యాలు నిర్వహించేవారు ఎవరికి చెప్పుకోలేక వారు అడిగింది ఇచ్చి పంపిస్తున్నారు. తాజాగా మాముళ్ళు కోసం వచ్చిన హిజ్రాలు ఏకంగా దాడులకు పాల్పడటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు దీనిపై దృష్టి సారించి ఇకమీదట ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుచున్నారు. దీనిపై తెలంగాణ హిజ్రాల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు దోమల మేరి మాట్లాడుతూ మధిరలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది హిజ్రాలు ఇటువంటి సంఘటనకు పాల్పడుతున్నారని, చట్టం ప్రకారం దాడి చేసిన హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ సంఘటన సాకుగా చూపించి హిజ్రాలందరిని నేరస్తులుగా చూడవద్దని ఆమె కోరారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...