మధిర డివిజన్లో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
మధిర సెప్టెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి మధిర నియోజకవర్గంలో ఇసుక మాఫియా పెట్రేగి పోతుంది. అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. నియోజకవర్గంలో ఎక్కడలేని విధంగా మూడు నదులు ఉండటంతో ఇసుక మాఫియాకు కలిసొచ్చింది. మధిర నియోజకవర్గంలో ఎర్రుపాలెం మండలంలో కట్టలేరు, మధిర, బోనకల్ మండలాల్లో వైరా నది, చింతకాని, ముదిగొండ మండలాల్లో మున్నేరు నదులు ప్రవహిస్తున్నాయి. ఈనదుల్లో పుష్కలంగా ఇసుక ఉండటంతో ఇసుక మాఫియా ఇసుకను కాజేసేందుకు చేసేందుకు రంగంలోకి దిగింది. తొలత అభివృద్ధి పనుల పేరుతో ఇసుక మాఫియా అధికారులను మచ్చిక చేసుకొని ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీస్ శాఖ, మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ నిద్ర నటించడంతో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు గతంలో టాస్క్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు అందుకున్న టాస్క్ పోర్న్ పోలీసులు వరుసగా దాడులు చేయటంతో కొద్దికాలం పాటు మధిరలో ఇసుక అక్రమ రవాణా ఆగిపోయింది. పదిహేను రోజుల నుండి మధిర డివిజన్లో ఇసుక అక్రమ రవాణా భారీగా కొనసాగుతుంది. మండలంలో రాయపట్నం బుచ్చిరెడ్డిపాలెం వంగవీడు సిరిపురం నుండి భారీ స్థాయిలో ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిపోతుంది. అదేవిధంగా ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెం, సఖినివీడు, తక్కెళ్ళపాడు, బనిగండ్లపాడు బోనకల్లు మండలం మోటమర్రి, కలకోట, బ్రాహ్మణపల్లి చింతకాని మండలం చిన్న మండవ ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామాలనుండి ఇసుక భారీ స్థాయిలో ఖమ్మం కేంద్రానికి అక్రమ రవాణా కొనసాగుతుంది. అభివృద్ధి పనుల పేరుతో ఒక కూపన్ తీసుకుంటున్న ఇసుక మాఫియా ఆ కూపన్ పై 3 నుంచి 5 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నారు. ఇసుక అదనంగా తీసుకెళ్లేందుకు పోలీసులకు, మైనింగ్, రెవెన్యూ శాఖలకు ఇసుక మాఫియా భారీ నజారాణాలు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారానికి తగ్గట్టు ఆయా శాఖల అధికారులు ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలను భరించలేక ఇటీవల నక్కల గరబు గ్రామ ప్రజలు ఇసుక ట్రాక్టర్లకు అడ్డం తిరిగి వాటిని పట్టుకుని మధిర రూరల్ పోలీసులకు అప్పగించారు. స్థానికంగా గృహాలు నిర్మించుకునేందుకు ఒక ట్రక్కు ఇసుక తెచ్చుకోవాలంటే అనేక నిబంధనలు పెడుతున్న స్థానిక అధికారులు ప్రతిరోజు వందల సంఖ్యలో మధిర నుండి ఖమ్మంకు అక్రమంగా ఇసుక ఎలా వెళ్తుంది? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాత్రిపూట నిరంతరం ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తరలిపోతున్న ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని మధిర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై మధిర సిఐ మురళిని వివరణ కోరగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా అవుతున్నట్లు సమాచారం తెలిస్తే తక్షణమే తనకు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...