కబడ్డీ క్రీడా ఖ్యాతి పెరగాలి: హరిసింగ్

Published: Friday March 05, 2021
ఖమ్మం మర్చి 5 (ప్రజాపాలన ప్రతినిధి): ప్రజా సమస్యలను పరిష్కరించటం తో పాటు నియోజకవర్గం అబివృద్ది కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ క్రీడాకారులను ప్రోత్సహిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు క్రీడల పై ఆసక్తితో ప్రత్యెక శిక్షణాలు పొందుతున్నారు. ఏజన్సీ ప్రాంతమైన ఇల్లెందు నియోజకవర్గం కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ .ఆమె భర్త వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ హరిసింగ్ నాయక్ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికోసం ప్రత్యెక కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగానే కబడ్డీ క్రీడను ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మంచిపలితాలు వస్తున్నాయి. భద్రాద్రి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు ప్రత్యెక శిక్షణ ఇప్పించారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే సీనియర్. జూనియర్. క్రీడాకారులను ఎంపికలు చేసి ఇల్లెందులోని సింగరేణి మైదానం లో 15 రోజులపాటు శిక్షణ ఇప్పించారు. స్టేట్ మీట్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రిడా జట్లకు గురువారం ప్లేయింగ్ కిట్టు అందించారు. ఈ సందర్భంగా ఏ ఎం సి చైర్మెన్ హరిసింగ్ నాయక్ మాట్లాడుతు కబడ్డీ క్రీడను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ క్రిడా ఖ్యాతి ని పెంచేందుకు కృషి జరగాలని కోరారు. పట్టణంలోని జెకె కాలనీ సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వాతి ముత్యం రైతు సమన్వయ కమిటీ సలహాదారులు పులిగండ్ల మాధవరావు