క్రీడాకారులు ప్రతిభను చాటాలి

Published: Thursday February 18, 2021
వలిగొండ ప్రజాపాలన గ్రామీణ క్రీడలతో క్రీడాకారులలోని సృజనాత్మకతను,స్నేహ భావాన్ని పెంపొందించవచ్చని సీనియర్ పాత్రికేయులు కలుకూరి రాములు అన్నారు. బుధవారం మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో కామ్రేడ్ కలుకూరి బిక్షపతి వెంకటమ్మ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ ఇలాంటి టోర్నమెంట్ తో గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వివిధ స్థాయిల్లో నిలపడానికి దోహదం చేస్తాయని క్రీడాకారులు శారీరక దృఢత్వంతో పాటు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. అదేవిధంగా తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలతో గ్రామీణ క్రీడలను నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. క్రీడలు క్రీడాకారుల యొక్క ప్రతిభను చాటడానికి మాత్రమేనని వ్యక్తిగత స్వార్ధానికి ఆస్కారం లేకుండా స్నేహభావంతో ఆటలు ఆడాలనే ఆయన సూచించారు. అంతకుముందు స్టేడియం ఏర్పడి సంవత్సరం గడిచిన సందర్భంగా వెల్వర్తి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కూచిమల్ల సుధాకర్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ దాతలు కలుకూరి రాములు, రాజు, కలుకూరి ఎల్లయ్య, టోర్నమెంట్ నిర్వాహకులు నాగిళ్ల రాము,టిఆర్ఎస్ మహిళ విభాగం మండల అధ్యక్షురాలు పిట్టల విజయలక్ష్మి,టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కలుకూరి రాములు, వార్డు మెంబర్లు బూడిద బిక్షమయ్య, కడవేరు సరోజ, కడవేరు యాదగిరి, ఎడవెల్లి యాదయ్య, బూడిద యాదగిరి తదితరులు పాల్గొన్నారు.