గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి

Published: Monday January 24, 2022
జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 23 (ప్రజాపాలన, ప్రతినిధి) : గ్రామీణ యువత క్రీడలలో రాణించాలని తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి, జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండలం లోని రహ పెళ్లి గ్రామములో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ తో కలిసి, యువత ఆధ్వర్యంలో చేపట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ యువత కబడ్డీ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత క్రీడలలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఈ పోటీల ద్వారా యువకులలో స్నేహ భావం పెరుగుతుందన్నారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుండి 25 పైగా టీములు ఉన్నట్లు పోటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుంకరి మంగ, సర్పంచ్ శ్రీనివాస్, రుకుం ప్రహ్లాద్, నాయకులు రాము గౌడ్, గడ్డల సురేష్, కోట వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.