సిద్దులూరులో క్రికెట్ టోర్నమెంట్

Published: Friday February 26, 2021

గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 ( ప్రజాపాలన ) : ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని సిద్దులూరు గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండలానికి చెందిన సిద్ధులూరు గ్రామములో సిద్దులూరు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపిటిసి గౌసొద్దిన్ సమక్షంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారు మాట్లాడుతూ..క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు క్రీడలపైన ఆసక్తి ఉండాలని పేర్కొన్నారు. క్రీడలకు వయస్సుతో సంబంధం లేదని, ప్రతి ఒక్కరు క్రీడలు ఆడేందుకు ప్రయత్నించాలని కోరారు. క్రీడలతో స్నేహభావం, పరిచయాలు, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలు పరిఢవిల్లుతుందని గుర్తు చేశారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఎవ్వరు కూడా నిరుత్సాహ పడరాదని తెలిపారు. గెలిచిన వారు సంతోషపడుతారు, ఓడిన వారు అనుభవాన్ని పొందుతారని చెప్పారు. మొదటి బహుమతి రూ.20,000. రెండవ బహుమతి రూ.10,000 అందిస్తామని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు గ్రామ యువకులతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.