వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు

Published: Monday January 17, 2022
బోనకల్ జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం రోజున మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కబడ్డీ పోటీలకు ముఖ్యఅతిథిగా మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు పాల్గొని ముందుగా వివేకానంద చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి, పోటీలను ప్రారంభించారు. వారితో పాటు గ్రామ సర్పంచ్ భూక్యా సైదా నాయక్, ఎంపీటీసీ గుగులోత్ రమేష్, మాజీ జెడ్పిటిసి భానోత్ కొండ, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కబడ్డీ పోటీల్లో గెలుపొందిన వారికి మొదట, రెండోవ, మూడవ, నాలుగవ బహుమతులు అందజేయనున్నట్లు వివేకానంద యూత్ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, కబడ్డీ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.