క్రికెట్ క్రీడాకారుల ను ప్రోత్సహిస్తున్న ప్రవాస భారతీయులు

Published: Tuesday November 23, 2021

కొడిమ్యాల నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): గత రెండు సంవత్సరాల నుండి కొడిమ్యాల మండల యువత ను  ఆటలవైపు చైతన్యం చేయడంలో భాగంగా కొడిమ్యాల లో మరియు వివిధ మండలాలకు  వెళ్లి  వారితో క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్న కొడిమ్యాల మండల  క్రికెట్ టీం కి గుర్రం సురేష్ కొడిమ్యాల ప్రవాస భారతీయులు (ఇజ్రాయెల్) 11,000/- రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది. అనంతరం 25 టీషర్ట్ లను సీనియర్ క్రీడాకారులు రాపర్తి లక్ష్మణ్, కృష్ణం రాజు, సామ సురేందర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహనాచారి, డేవిడ్ సన్. క్రీడాకారులు తక్షిల్,  రాకేష్, సజన్, మహేష్, శేఖర్, సురేష్, తిరుపతి, అనిల్, డేనియల్, వెంకటేష్, శేఖర్, మనోజ్, శ్రీకాంత్, పాల్గొన్నారు