అంతారంలో జిఆర్ఆర్ క్రికెట్ టోర్నమెంట్

Published: Wednesday March 03, 2021

జిఆర్ఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కోకట్ రాఘవేందర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా మార్చ్ 02 ( ప్రజాపాలన ప్రతినిధి ) : ఆటలు ఆడడం వలన క్రీడా స్ఫూర్తితో పాటు నాయకత్వ లక్షణాలు అలవడుతాయని జిఆర్ఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కోకట్ రాఘవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ధారూర్ మండలానికి చెందిన అంతారం గ్రామంలో చేవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ( జిఆర్ఆర్ ) సౌజన్యంతో అంతారం జిఆర్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ నర్సిరెడ్డి సమక్షంలో ప్రారంభించారు. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి ఎంపి అనివార్య కారణాలతో రాలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క్రీడల వలన సమిష్టి తత్వం, సమయ స్ఫూర్తి ఆలోచనలు, ఎత్తుకు పై ఎత్తులు, ఐకమత్యం వంటి లక్షణాలు యువతలో సాకారమవుతాయని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే క్రీడాకారుల ఆచార వ్యవహారాలు, సత్సంబంధాలు కొనసాగుతాయని వివరించారు. గెలిచేందుకు జట్టు సభ్యులు సమిష్టిగా నిర్ణయం తీసుకొన్నదానికి కట్టుబడి, క్రీడల నియమాలను ఉల్లంఘించకుండా ఆడడం క్రీడాకారుల ముఖ్య లక్షణమని తెలిపారు. 35 టీములు 8 ఓవర్ల చొప్పున ఆడవలసి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేమారెడ్డి, కోకట్ సుభాన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బలవంత్ రెడ్డి, ఆర్గనైజర్స్ కె.వెంకట్, నవభారత్ రెడ్డి, సిహెచ్.శ్రీశైలం, మహమ్మద్ రఫీ, షఫీ పాష, టి.శ్రీనివాస్, బి.నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.