గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

Published: Saturday February 06, 2021
తండ్రి కలలను సాకారం చేస్తున్న తనయుడు 
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
 
 
పాలేరు నేలకొండపల్లి ఫిబ్రవరి 5 ప్రజాపాలన
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం
నేలకొండపల్లి : క్రీడా పోటీల్లో క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీచుకొని క్రీడా స్ఫూర్తితో ముందుకు పోవాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్ వి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. మొదటి బహుమతి రూ 8016 గోకినేపల్లి, ద్వితీయ బహుమతి రూ 5016 శాంతీనగర్,తృతీయ బహుమతి రూ 3016 గోకినేపల్లి అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ క్రీడలకు పెద్ద పీట వేస్తుందన్నారు. గ్రామీణ స్థాయి నుంచే దేశవాళీ క్రికెట్ కి చాలా మంది ఎంపికయ్యారన్నారు. పట్టుదల ఉంటే సాదించలేనిది ఏమీ లేదన్నారు. క్రీడాకారులు ఆత్మ విశ్వాసంతో ఆడి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు ఒక సారి ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహ పడకుండా మరోసారి పట్టుదలతో ఆడితే గెలుపు సాద్యమవుతుందన్నారు. తన తండ్రి స్వర్గీయ రాయపూడి వెంకటేశ్వర్లు కన్న కలలను తనయుడు రాయపూడి నవీన్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో  నేలకొండపల్లి సర్పంచ్, ఆర్ వి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రాయపూడి నవీన్ కుమార్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, ఎంపిటిసి బొడ్డు బొందయ్య, సర్పంచ్ లు వల్లాల రాదాకృష, రేగూరి శ్రావణ్ కుమార్, ఉపసర్పంచ్ లక్కం ఏడుకొండలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ హుస్సేన్, నేలకొండపల్లి పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు