సిద్దులూరు అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్

Published: Wednesday March 03, 2021

సిద్దులూరు ఎంపిటిసి గౌసొద్దిన్
వికారాబాద్ జిల్లా మార్చ్ 02 ( ప్రజాపాలన ప్రతినిధి ) : కచదువుతో పాటు వివిధ రకాల క్రీడలు ఆడడం వలన శారీరక పటుత్వం, బుద్ధి వికాసం, క్రీడా నైపుణ్యం పెరుగుతుందని సిద్దులూరు ఎంపిటిసి గౌసొద్దిన్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలానికి చెందిన సిద్దులూరు గ్రామంలో సిద్దులూరు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులకు అంగన్‌వాడి ఉపాధ్యాయిని 5,000 రూపాయల నగదు బహుమతిని ఎంపిటిసి గౌసొద్దిన్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ క్రీడలు ఆడినా గెలుపోటములు సహజమని గుర్తు చేశారు. గెల్చిన జట్టు సభ్యులు సంతోషంతో పాటు ఓడిన జట్టు సభ్యులను బాగా ఆడారని అభినందించాలని సూచించారు. క్రికెట్ టోర్నమెంట్ లో 30 జట్లు 8 ఓవర్ల చొప్పున ఆడుతున్నారని పేర్కొన్నారు. గెలుపొందిన జట్టు సభ్యులకు 20,000 రూపాయలు, రన్నర్గా నిలిచిన జట్టు సభ్యులకు 10,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ద సిరీష్ ఆటగాడికి 1,000 రూపాయలతో పాటు మెమెంటో అందజేయబడునని వివరించారు. ఈ కార్యక్రమంలో జనార్ధన్, సుధాకర్, మల్లేశం, హరి, అశోక్, పరమేశ్వర్, జహాంగిర్, పెంటని పరమేశ్వర్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు.