నేడు జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక

Published: Tuesday March 02, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చేనెల 5 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు జనగామ జిల్లా కేంద్రంలో జరుగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు.