శభాష్ మేఘన.... రైఫిల్ షూటింగ్ లో టాప్

Published: Tuesday March 02, 2021
హైదరాబాద్ 1 మార్చి (ప్రజాపాలన ప్రతినిధి.) : హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్  శాంపియన్ షిప్ పోటీల్లో సాదుల మేఘన నాలుగు పతకాలు సాధించి నేటితరం ఔత్సాహిక క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది.హైద్రాబాద్ లోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పన్నెండో స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థిని మేఘన ప్రతిష్టాత్మకంగా జరిగిన రైఫిల్ షూటింగ్ లో పాల్గొని అత్యంత ప్రతిభను ప్రదర్శించింది. ఛాంపియన్ షిప్ పోటీల్లో నాలుగు మెడల్స్ సాదించించిన చిన్నారి మేఘనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో పాటు రాష్టం లోని ఇతర పాఠశాల విద్యార్థులు ప్రశంశిస్తున్నారు. చిన్న వయసు నుంచే రైఫిల్ షూటింగ్ పై మక్కువ తో సాధన చేస్తూ నేడు రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించింది. ఛాంపియన్ షిప్ పోటీల్లోని పలు అంశాల్లో పాల్గొన్న మేఘన స్వర్ణ పథకంతో పాటు వివిద పథకాలను సొంతం చేసుకోవడం పట్ల ఉమ్మడి. వరంగల్. ఖమ్మం జిల్లాల క్రీడాకారులు హర్షం వ్యక్తం చేసారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సికింద్రాబాద్ రైల్వే డీసీపీ సాదుల సారంగపాణి తనయ మేఘన కావటం విశేషం తెలంగాణ రైఫిల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మేఘన నాలుగు మెడల్స్ సాధించటంపట్ల డీసీపీ హర్షం వ్యక్తం చేసారు. విద్యతోపాటు ప్రతి విద్యార్థి క్రీడలను అలవర్చుకోవలని కోరారు.మానసిక ఉల్లాసం. ఉత్సంతో పాటు విద్యార్థుల్లో మనోధైర్యం పేరుగుతుందన్నారు..
క్లిష్ట పరిస్థితుల్లో......
ప్రస్తుతం అన్నివర్గల ప్రజలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారని. ఇటువంటి తరుణంలో రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించటం సహసోపేతమని  గొప్ప తెలంగాణ రైఫిల్ అసోసియేషన్(టి ఆర్ ఎ)
అధ్యక్షుడు అమిత్ సాంఘి కొనియాడారు. హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ(హెచ్ సి యు) లోని రైఫిల్ రేంజ్ లో నిర్వహించిన ఛాంపియన్ షిప్ ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాంఘి మాట్లాడుతు అయిదు రోజుల పాటు నిర్వహించిన పోటీలను కోవిడ్ నిబంధనల కు లోబడి ఆధ్యంతం అబ్బురపరిచేలా నిర్వహించారన్నారు. ఏడవ తెలంగాణ షూటింగ్ ఛాంపియన్ షిప్ ను విజయవంతం గా నిర్వహించారని కోవిడ్19 క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మొదటి సారి గా ఎలక్ట్రానిక్ టార్గెట్ లను ఉపయోగించటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జట్లు, అధికారులు, షూటర్లు సాధించిన విజయాలను క్రీడా పోటీలలో బోర్డ్ సభ్యులు నిబద్ధతను ఆయన కొనియాడారు. పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ ఎయిర్ పిస్టల్ 25 మీటర్ల పిస్టల్ వంటి అన్ని ఈవెంట్లలో పాల్గొని విజయకేతనం ఎగురవేశరన్నారు. ఈ కార్యక్రమంలో సబీర్ అలీఖాన్, మహ్మద్ వాజీద్ ఖాన్, మహ్మద్ ముస్తాప ఖాన్, కిరణ్, రాజకుమార్ వసీనుందర్ నాలి, శ్రవణ్ కుమార్, మహ్మద్ ఆసన్ షరీఫ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బాద్యులు గగన్ నారంగ్ ఆధ్వర్యంలో గన్ ఫర్ గ్లోరీ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మస్థైర్యం కావాలి...
ప్రతి విద్యార్థినిలో ఆత్మస్థాయిర్యం ఉండాలని 
సాదుల మేఘన అన్నారు. రైఫిల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నాలుగు పథకాలు సాధించి అందరి ప్రశంశలు అందుకొన్న మేఘన ప్రజాపాలన ప్రతినిధితో మాట్లాడుతూ షూటింగ్ స్పోర్ట్స్ మహిళలు, బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొందింప జేసేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను అధిగమించి ముందుకు సాగేందుకు కరాటే,జిమ్నాస్టిక్ తరహా పోటీలు నిర్వహించటం చాలా మంచిదన్నారు. తన తల్లిదండ్రులు ప్రోత్సాహించడం తోనే రాణిస్తున్ననని మేఘన తెలిపారు. ఆమె తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కు తన విజయానికి కృషి చేసిన కోచ్ లు ప్రసన్న,మాలబిక లకు కృతజ్ఞతలు తెలియజేశారు.