క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన భరత్ చౌహాన్

Published: Tuesday March 16, 2021

జన్నారం మార్చి 15  ప్రజాపాలన : మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ నాయకులు భరత్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో గెలిచిన జట్టు జిల్లా స్థాయికి జిల్లా స్థాయిలో గెలిచిన జట్లు రాష్ట్ర స్థాయి కి వెళ్తాయి అన్నారు. పట్టుదలతో ఆడి మండల జిల్లా రాష్ట్ర స్థాయిలలో ఆడాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి లో గెలిచిన జట్టులో నీ సభ్యులకు ఐపీఎల్ జట్లలో అవకాశం లభించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోర్లకుంట ప్రభుదాస్ నాయకులు మోహన్ రెడ్డి సుభాష్ రెడ్డి పసి ఉల్లాఖాన్ఇం ద్రయ్య ఇమ్రాన్ ఖాన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.