కప్పపహాడ్- KPL -3 క్రికెట్ టోర్నమెంట్ లో ప్రారంభించన గ్రామ సర్పంచ్ సామల హంసమ్మా యాదగిరిరెడ్డి, ఉ

Published: Monday January 24, 2022
ఇబ్రహీంపట్నం జనవరి తేది 23 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల పరిధిలో కప్పపహాడ్ గ్రామంలో గ్రామ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన KPL-3 ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం గ్రామ సర్పంచ్ సామల హంసమ్మా యాదగిరిరెడ్డి, ఉప- సర్పంచ్ మహమ్మద్ మునీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని  గ్రామ క్రికెట్ క్రీడాకారులు, టోర్నమెంట్ నిర్వాహకులతో కలిసి టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ సామల హంసమ్మా యాదగిరిరెడ్డి, ఉప- సర్పంచ్ మహమ్మద్ మునీర్ మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న యువకులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో కలిసిమెలిసి టోర్నమెంట్ విజయవంతం చేయాలని రానున్న రోజుల్లో క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సామల శ్రీనువాస్ రెడ్డి, తెరాస పార్టీ విద్యార్థి విభాగం నియోజకవర్గ నిట్టు జగదీశ్వర్, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యనిర్వాహక కార్యదర్శి గ్రామ కో-ఆప్షన్ సభ్యులు ఉడతల సతీష్ గౌడ్, యువజన నాయకులు బూడిద రాఘవేందర్ రెడ్డి, యాలల జైపాల్ రెడ్డి, బీజేవైఎం నాయకులు శ్రీశైలంమ్, పల్లపు రమేష్ టోర్నమెంట్ నిర్వాహకులు శివ గౌడ్, పవన్ గౌడ్, నిట్టు శ్రీనివాస్, సుదీర్ రెడ్డి, బుట్టి అశోక్, వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు, క్రికెట్ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.