తిరుపతి మహానాడుకు గైర్‌హజరైన తెలుగుదేశంపార్టీ నాయకులు

Published: Wednesday June J, 2016

కొవ్వూరు:తిరుపతి మహానాడుకు గైర్‌హజరైన తెలుగుదేశంపార్టీ నాయకులు, తెలుగు తమ్ముళ్ళ. కొవ్వూరు నుండి మహానాడుకు హాజరుశాతం లేదనే చెప్పవచ్చును. కొవ్వూరు శాసనసభ్యుడు కె.ఎస్‌.జవహార్‌ ఓక్కడే మహానాడుకు హాజరైనారు. కొవ్వూరు మున్సిపల్‌ చైర్మన్‌ సూరపని చిన్ని అమెరికా పర్యటనలో ఉన్నారు. కొవ్వూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆళ్ల హరిబాబు, రాష్ట్ర తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, శ్రీరామా సొసైటీ అధ్యక్షులు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ అధ్యక్షులు కంఠమణి రామకృష్ణ, మాజీ ఎం.పి.పి.వేగి చిన్న, ఎం.పి.పి.వాడవల్లి రాజ్యలక్ష్మి, పట్టణ తెలుగుదేశం పార్టీ అద్యక్షులు మద్దుల సత్యనారాయణ, అదికార ప్రతినిది కలగర రంగారావు ఇలా చెప్పుకుంటూ పోతే మండలం నుండి ఏ ఒక్క నాయకుడు కూడా తిరుపతి మహానాడుకు వెళ్ళిన దాఖలాలు లేవు. నియోజకవర్గంలో, మున్సిపాలిటీలో, మండలంలో అదికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ తిరుపతి మహానాడుకు హాజరుకాకపోవడం చర్చానీయాంశంగా మారింది.