మహానాడులో మొదటి రోజు

Published: Friday May J, 2016

మహానాడులో మొదటి రోజు  కార్యక్రమాలు. రాబోయే కాలంలో అనుసరించాల్సిన పంథా ఎలా ఉండాలన్న అంశాన్ని తెదేపా మహానాడు వేదికగా నిర్ణయించనుంది. ఈ నెల 27 నుంచి 29 వరకూ జరిగే మహానాడులో గత రెండేళ్ల కాలంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని...భవిష్యత్తుకు దిశానిర్దేశం కోసం పలు అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన అనంతరం ఇది రెండో మహానాడు. జాతీయ పార్టీగా ఆవిర్భవించి కూడా దాదాపుగా అంతే కాలమైంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల అంశాలపైనా దృష్టిపెట్టనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి మొత్తం 30 వేల మంది ప్రతినిధులు మహానాడుకు రానున్నారని అంచనా. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష....వాటిలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? అన్న అంశంపైనా కొంత చర్చ జరగనుంది. భవిష్యత్తు మరింత ప్రజాదరణ పొందేందుకు ఏం చేయాలన్న అంశంపై ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. తెలంగాణకు సంబంధించి పార్టీని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం, తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేలా తీర్మానాలు ఉండనున్నాయి. ఏపీకి సంబంధించి 13అంశాలు, తెలంగాణకు సంబంధించి 8అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. ఉమ్మడిగా ఏడు తీర్మానాలుంటాయి.