కాంగ్రెస్ క్యాడర్ లో జోష్.. ఖమ్మం లో స్టేట్ మీట్

Published: Monday February 08, 2021
▶️ *ఖ‌మ్మంకు త‌ర‌లివ‌చ్చిన రాష్ట్ర అగ్ర నాయ‌క‌త్వం*
▶️ *భారీగా హాజ‌రైన కార్య‌క‌ర్త‌లు*
▶️ *టీఆర్ఎస్, నేతల  పై నిప్పులు చెరిగిన హస్తం నేతలు  
 
ఖమ్మం  బ్యూరో. ఫిబ్రవరి 7
ప్రజాపాలన
 
ఖ‌మ్మం నగరం లో ఆదివారం  నిర్వహించిన ఉమ్మడి జిల్లా బూత్ స్థాయి నేతల సమావేశం తో పార్టీ క్యాడర్ లో జోష్ పెరిగింది.సీఎల్పీ నేతమల్లు భ‌ట్టి విక్ర‌మార్క  ఆద్వర్యం లో నిర్వహించిన సమావేశం కు బారి సంఖ్యలో క్యాడర్ హాజరు అయ్యారు. ఏ ఐసీసీ .టీపీసీసీ నేతలు ఖమ్మం కు కదలి రావటం తో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది.  ఖ‌మ్మం లోని సీక్వెల్ రిస్సార్ట్స్ లో రాష్ట్ర నాయకత్వం తోపాటు. తెలంగాణ లోని  33 జిల్లాల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షులు స‌మావేశం లో పాల్గొన్నారు.  రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మానిక్యం ఠాగూర్‌,టీపిసిసి అధ్యక్షులు.ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎల్పీ నేత మల్లు  భ‌ట్టి విక్ర‌మార్క ఏఐసీసీ కార్య‌ద‌ర్శులు శ్రీనివాస‌న్‌, బోస్ రాజు, రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్ర‌భాక‌ర్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్.మాజీ ఎమ్మెల్సీ లు పోట్లా నాగేసర్వరావు.రాములు నాయక్.ఖమ్మం ఏ ఎం సి మాజీ చైర్మెన్.మానుకొండ రాదా కిషోర్.జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గప్రసాద్.  ప‌లుపురు సీనియ‌ర్ పాల్గొన్నారు.  తొలిసారి బూత్ స్థాయి నాయ‌క‌లకు ఐడీ కార్డుల‌ను అందించారు.విలేఖర్ల సమావేశం లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతు ఏ ఐసీసీ పగ్గాలు రాహుల్ గాంధీ చేపట్టాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించమన్నారు.నెల రోజుల్లో రాష్టంలోని అన్ని జిల్లా ల్లో బూత్ కమిటీలు పూర్తీ చేయాలనీ మరికొన్ని అంశాల పై చర్చించి తీర్మానించటం జరిగిందన్నారు.
 బూత్ స్థాయి నాయ‌కుల స‌మావేశంలో  సీఎల్నీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ నేతలు. మంత పువ్వాడ విధానాల పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. అవినీతి పెరిగిపోయింద‌ని, భావ‌వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ లేకుండా పోయింద‌ని మండిప‌డ్డారు.  ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోఅహంకారం, అవినీతి హ‌ద్దుల్లేకుండా పెరిగింద‌ని  భ‌ట్టి ఆరోపించారు.  ప్ర‌జాస్వామ్యం, భావ స్వేచ్ఛ అనేవి న‌గ‌రంలో లేకుండా పోయాయ‌ని  తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. అప్ర‌జాస్వామ్యానికి స‌మాధానం చెప్పే రోజులు త్వ‌ర‌లోనే ఉన్నాయ‌ని  అన్నారు. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి అవినీతి కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. పేద‌ల కోసం ఇచ్చి‌న  జీ.ఓ. లను అడ్డం పెట్టుకుని ప్ర‌భుత్వ‌ భూములును రెగ్యుల‌రైజ్ చేసుకున్న స్థానిక మంత్రికి బుద్ది చెప్పాల‌ని భ‌ట్టి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌శ్నిస్తే పోలీసు కేసులు, భావ వ్య‌క్తీక‌ర‌ణ చేస్తే అక్ర‌మ నిర్భంధాలు చేస్తున్నార‌ని భ‌ట్టి అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. 
ఖ‌మ్మం న‌గ‌రంలోని ప్ర‌జ‌లు అనేక భావాల‌ను, ప్ర‌జాస్వామ్యానికి అత్యంత విలువ ఇస్తార‌ని అన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ ప‌రిపాలిస్తున్న స‌మయంలోనూ, అన్ని వ‌ర్గాల‌కు, పార్టీల‌కు స్వేచ్ఛ‌గా త‌మ భావాల‌ను వ్య‌క్తం చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింద‌ని భ‌ట్టి  వివ‌రించారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అందుకు పూర్తి విరుద్ధంగా నియంతృత్వ వ్య‌వ‌స్థ‌లా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌లకు కూడా భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ లేకుండా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తోంద‌ని అన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని పాల‌న చేస్తున్న కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి త్వరలో జ‌రిగే ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెబుతార‌ని అన్నారు. 
 
ఖ‌మ్మం జిల్లాలోనే వ్య‌వ‌స్థ‌ను ఏకీకృతం చేసి ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ  ప్ర‌తి డివిజ‌న్‌, బూత్ లో ఓట‌ర్ మ్యాపింగ్ తో స‌హా ప‌ని చేయ‌బోతున్నాం అన్నారు. టీఆర్ఎస్ నాయ‌త‌క్వంపై పోరాటం చేస్తామ‌ని భ‌ట్టి అన్నారు. టీఆర్ఎస్ నాయ‌కులు ఏ ఒక్క కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ను భ‌య‌పెట్టినా, బెదిరించినా.. స‌హించేది లేద‌ని భ‌ట్టి హెచ్చ‌రించారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు మొత్తం రాష్ట్ర నాయ‌క‌త్వం అండ‌గా ఉంటుంద‌ని భరోసా  ఇచ్చారు.  ‌త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఖ‌మ్మం  కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ని  గెలిపించి.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినాయ‌క‌త్వానికి కానుక ఇవ్వాల‌ని భ‌ట్టి పార్టీ శ్రేణుల‌కు పిలునిచ్చారు.
 
 
 
Attachments are
 
Reply
Forwar