కోల్ పోల్ ఏరియాల్లో 67.42 శాతం పోలింగ్

Published: Wednesday December 27, 2023

 

సింగరేణి(కొత్తగూడెం) : తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలోని సింగరేణి సంస్థలో 11 డివిజన్లలోని  గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో 84 పోలింగ్ కేంద్రాలలో  ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది.  ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 39,832 మంది కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వేయాల్సి ఉండగా మధ్యాహ్నం భోజన సమయానికి అన్ని ఏరియాల్లో కలిపి 26815 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2017 తురువాత నుండి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతుండటంతో సర్వత్రా అసాక్తి నెలకొంది. 67.42 శాతం ఓట్లు పాలయ్యాయి. కార్పొరేట్ లో 887, కొత్తగూడెం ఏరియాలో 1545, ఇల్లందు 500, మణుగూరు 1716, ఆర్జీ 1లో 1748, 1874, ఆర్జీ2లో 2129, ఆర్జీ3లో 2678, భూపాలపల్లి 3660, బెల్లంపల్లి 756, మండమర్రి 3061, శ్రీరామ్ పూర్ 3730, 2536 మొత్తం కలిపి 67.42 శాతం ఓట్లు పోల్ ఆయ్యాయి